లద్దాఖ్‌ రోడ్లపై ‘పేటా’ నటి బైక్‌ రైడ్‌

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన నటి మాళవికా మోహన్‌ తన ట్రావెలింగ్‌ డైరీస్‌కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నారు. తనకెంతో ఇష్టమైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై లద్దాఖ్‌ రోడ్లలో విహరించడం సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా....

Published : 19 Oct 2020 19:20 IST

వైరల్‌గా మారిన ఫొటోలు

తిరువనంతపురం: లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మలయాళీ నటి మాళవికా మోహన్‌ తన ట్రావెలింగ్‌ డైరీస్‌కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నారు. తనకెంతో ఇష్టమైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై లద్దాఖ్‌ రోడ్లలో విహరించడం సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఆనాటి బైక్‌రైడ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. దీంతో సదరు ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలతోపాటు లద్దాఖ్‌లోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను నేను ఆస్వాదించాను. కొంగొత్త అద్భుతాలను అన్వేషిస్తూ బైక్‌ రైడ్‌ చేయడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి హిమాలయాలు నాకెంతో ఇష్టమైన ప్రదేశంగా మారాయి. అందరూ కారులో ప్రయాణించడానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ బైక్‌పై ప్రయాణం చేస్తే.. గాల్లో విహరించినట్లు ఉంటుంది. చిరుగాలిని సైతం మనం పూర్తిగా ఆస్వాదించవచ్చు. అలాగే బైక్‌రైడ్‌ సమయంలో నా మోముని తాకిన మంచు బిందువులను ఇప్పటికీ నేను ఆస్వాదించగలుగుతున్నాను. త్వరితగతిన పరిస్థితులు చక్కబడితే బైక్‌ రైడ్‌కి వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని మాళవిక తెలిపారు. అయితే మాళవిక పెట్టిన పోస్ట్‌కు అమలాపాల్‌ ఫిదా అయ్యారు. ‘వాట్‌ ఏ క్రేజీ. ఈసారి మనిద్దరం కలిసి వెళ్దాం’ అని రిప్లై ఇచ్చారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పేటా’ చిత్రంలో మాళవికా మోహన్‌ ఓ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమా విజయంతో ఆమె  విజయ్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్‌’ చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటించారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని