విజయ్‌ తండ్రిగా సురేశ్‌గోపి..?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈసినిమా షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.

Published : 27 Nov 2020 08:14 IST

జోరుగా సాగుతోన్న ప్రచారం

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈసినిమా షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఫైటర్‌’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు.

పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ  సురేశ్‌ గోపీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌ తండ్రి పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. ‘ఫైటర్‌’ చిత్రంలో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ ముఖ్య భూమిక పోషించనున్న  క్రమంలో.. సదరు పాత్రకు సురేశ్‌ గోపీ అయితే సరిపోతారని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు ఆయనను సంప్రదించగా.. ‘ఫైటర్‌’లో నటించేందుకు ఆయన ఆసక్తికనబరిచారని పలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని