మెగాస్టార్‌ను కలిసిన విష్ణు.. కారణమేంటో..?

సినీ కథానాయకుడు మంచు విష్ణు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాం. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Published : 23 Dec 2020 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ కథానాయకుడు మంచు విష్ణు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, చిరును ఎందుకు కలిశారన్న విషయం చెప్పకపోగా.. కారణం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడంతో సినీవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే.. ప్రస్తుతం మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌లో చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే చిరును విష్ణు కలిశారంటూ కొన్ని వార్తలు వస్తుండగా.. లేదులేదు.. చిరు సినిమా ‘లూసిఫర్‌’లో మంచు విష్ణు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. మరి.. వీళ్లిద్దరి కలయికకు కారణమేంటో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’లో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి, రుహి సింగ్‌, నవీన్‌చంద్ర, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీంత అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మోహన్‌ రాజ్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ చేయనున్నారు.

ఇదీ చదవండి..

‘షకీలా’ న్యూ సాంగ్‌ చూశారా?

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు