అనుష్క పోస్ట్‌: ఆ కామెంట్‌పై మారుతి ఫైర్‌

బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ ప్రస్తుతం తల్లికాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. తన ఆనందాన్ని అందరికీ తెలియచేస్తూ తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే ఓ మహిళా జర్నలిస్ట్‌ మాత్రం కొంచెం వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘అనుష్క, ఆయన మిమ్మల్ని తల్లిని..

Published : 15 Sep 2020 01:20 IST

అనుష్కకు ఆ హక్కు ఉంది: దర్శకుడు

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ ప్రస్తుతం తల్లికాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. తన ఆనందాన్ని అందరికీ తెలియచేస్తూ తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే ఓ మహిళా జర్నలిస్ట్‌ మాత్రం కొంచెం వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘అనుష్క, ఆయన మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్‌కి మహారాణిని చేయలేదు. మరీ అంత సంబరపడకండి’ అంటూ జర్నలిస్ట్‌ చేసిన చేసిన కామెంట్‌పై దర్శకుడు మారుతి ఫైర్‌ అయ్యారు. ఒక రాజ్యానికి రాణిగా ఉండటం కంటే ఓ బిడ్డకి తల్లిగా ఉండడంలోనే మహిళకు ఎంతో సంతోషం ఉందని ఆయన అన్నారు.

‘ఒక మహిళా జర్నలిస్ట్‌ అయిన మీరు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం విచారంగా ఉంది. ఇంగ్లాండ్‌కు రాణిగా ఉండటం కంటే మాతృత్వపు ప్రేమను ఆస్వాదించడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే.. ప్రతి మహిళా ఓ మహారాణినే. ప్రతి సంతోషకరమైన నివాసం ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణమైన స్త్రీ. తల్లికాబోతున్న క్షణాలను ఆసాంతం ఆనందించే హక్కు ఆమెకు ఉంది’ అని మారుతి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని