ఘనంగా నిహారిక-చైతన్య నిశ్చితార్థం

మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు

Published : 14 Aug 2020 02:12 IST

హైదరాబాద్‌: మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకోబోతున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు, చైతన్య కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల నిహారిక  చైతన్యతో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్‌ చేస్తూ.. ‘అతడు నావాడు..’ అని పేర్కొన్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని