Updated : 09/12/2020 11:55 IST

NISChay: డ్యాన్స్‌ చేసిన చిరు,అరవింద్‌ దంపతులు

నిహారిక మెహందీ వేడుకల్లో ఆకట్టుకునే విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగబాబు కుమార్తె, కొణిదెల వారసురాలు నిహారిక వివాహ వేడుకలు ఉదయ్‌‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌రావు తనయుడు చైతన్యతో నిహారిక బుధవారం రాత్రి 7.15 గంటలకు ఏడడుగులు వేయనున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి సంగీత్‌.. మంగళవారం మెహందీ వేడుకలు‌ ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నాయి.

కాగా, సంగీత్‌ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలకు చెందిన యువ హీరోలందరూ కలిసి స్టేజ్‌పై స్టెప్పులేసి ఎంజాయ్‌ చేయగా.. తాజాగా, మెహందీ సెలబ్రేషన్స్‌లో మరికొన్ని అందమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఓవైపు పవన్‌కల్యాణ్‌ తన తనయుడు అకీరాతో వేడుకల్లో తళుక్కున మెరిశారు. మరోవైపు బన్నీ, చిరు-సురేఖ దంపతులు ‘బంగారు కోడిపెట్టా’ పాటకు స్టెప్పులేయగా.. అల్లు అరవింద్‌-నిర్మల దంపతులు ‘రామా చిలకమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేశారు. అంతేకాకుండా ‘గ్యాంగ్‌లీడర్‌’ పాటకు నాగబాబు, నిహారిక-చైతన్య డ్యాన్స్‌ చేసి మెప్పించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సదరు వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నిహారిక మెహందీ వేడుకల్లో చోటుచేసుకున్న అందమైన క్షణాలను మీరూ ఓ సారి చూసేయండి..!

ఇవీ చదవండి

వేడుకగా నిహారిక మెహందీ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

పవన్‌ అకీరా సేమ్‌ టు సేమ్‌

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

 







Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని