త్వరలోనే సినిమాల్లో నటిస్తా : మేఘన రాజ్

కన్నడ నటి మేఘనరాజ్‌ త్వరలోనే సినిమాల్లో నటించనుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని వె

Published : 15 Dec 2020 18:42 IST

బెంగళూరు: కన్నడ నటి మేఘనరాజ్‌ త్వరలోనే సినిమాల్లో నటించనుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 7న ఆమె భర్త చిరంజీవి సర్జా గుండె నొప్పితో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ‘నటనంటే నాకెంతో ఇష్టం. అది నా రక్తంలోనే ఉంది. నా భర్త చిరంజీవి సర్జా, నాకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని, నటించమని చెప్పేవారు. అందుకే నేను ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. తప్పకుండా త్వరలోనే సినిమాల్లో తిరిగి నటిస్తాను’. అని ఆమె చెప్పారు.

మేఘన తల్లిదండ్రులు సుందర్‌ రాజ్‌, ప్రమీల జోషాయ్‌ కన్నడ నటీనటులు. బాల నటిగా తన తండ్రితో కలిసి ‘జోకుమారస్వామి’ చిత్రంలో ఆమె నటించారు. అదే విధంగా తాజాగా తన కుమారుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని