జూనియర్‌ చిరుసర్జాకి జన్మనిచ్చిన మేఘన

ఇటీవల అకాల మరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టా వేదికగా ధ్రువ్‌ సర్జా ఈ శుభవార్త తెలియజేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్న ధ్రువ్‌.. తన అన్న కుమారుడ్ని అపురూపంగా చేతిలోకి తీసుకుని మురిసిపోయారు...

Published : 22 Oct 2020 16:54 IST

సర్జా కుటుంబానికి అక్టోబర్‌ ఎంతో ప్రత్యేకం..
 

బెంగళూరు: ఇటీవల అకాల మరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టా వేదికగా ధ్రువ్‌ సర్జా ఈ శుభవార్త తెలియజేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్న ధ్రువ్‌.. తన అన్న కుమారుడ్ని అపురూపంగా చేతిలోకి తీసుకుని మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, సర్జా కుటుంబానికి అక్టోబర్‌ నెల ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నెలలోనే చిరు, ధ్రువ్‌ జన్మించారు. ఇప్పుడు ఇదే నెలలో జూనియర్‌ చిరు కూడా జన్మించడంతో కుటుంబసభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు. మరోవైపు మూడేళ్ల క్రితం ఇదే రోజున చిరు-మేఘనల నిశ్చితార్థం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని