గుంటూరులో హోటల్‌.. మాటలు కాదు..!

గుంటూరులో హోటల్‌ పెట్టి, గొప్పవాడైపోవాలని ప్రయత్నిస్తున్నారు యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. ఎ. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ విడుదల.....

Updated : 10 Nov 2020 14:40 IST

‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: గుంటూరులో హోటల్‌ పెట్టి, గొప్పవాడైపోవాలని ప్రయత్నిస్తున్నారు యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. ఎ. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ షేర్‌ చేశారు. కచ్చితంగా ఈ చిత్రం అందరి హృదయాల్ని దోచుకుంటుందని, ఇప్పటికే తన కుటుంబంతో కలిసి సినిమా చూశానని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల్లోని పరిస్థితులు, మనుషుల స్వభావాల్ని ఈ ప్రచార చిత్రంలో చూపించారు.

‘నేను చెప్పానే, మా ఊర్లో బొంబాయి చట్నీ అదిరిపోద్దని.. చేసేది వీడే రాఘవ..’ అంటూ ఆనంద్‌ పాత్రను ఆరంభంలోనే పరిచయం చేశారు. ఆయన తండ్రి హద్దు, అదుపు లేకుండా అందర్నీ తిడుతూ కనిపించారు. ‘రాఘవ.. మీ నాన్నకు ఇంత ఆవేశం పనికిరాదయ్యా..’ అని డాక్టర్లు చెప్పే స్థాయికి బీపీ చేరుతుంది. ‘ప్రతి ఒక్కడు టౌన్‌కు వెళ్తా, టౌన్‌కు వెళ్తా అనడం ఫ్యాషన్‌ అయిపోయిందే..’ అని ఊరిలో వాళ్లు ఆనంద్‌ను ఎత్తిపొడుస్తుంటారు. ఈ పరిస్థితుల మధ్య ఆయన తన పల్లెటూరు వదిలి.. గుంటూరుకు వెళ్లి హోటల్‌ పెడతాడు. ఇలా సరదా సన్నివేశాలతో, ఆసక్తికరంగా  ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. నవంబరు 20న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని