రానాని ప్రశంసించిన మిహీకా..!

నటుడు రానాని ఆయన సతీమణి మిహీకా బజాజ్‌ ప్రశంసించారు. రానా చాలా కూల్‌ అని ఆమె అన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ అండర్‌టేకర్‌తో రానా ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ముచ్చటించారు. అండర్‌టేకర్‌తో జరిగిన సరదా సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోని అభిమానులతో...

Published : 15 Nov 2020 03:25 IST

హైదరాబాద్‌: నటుడు రానాని ఆయన సతీమణి మిహీకా బజాజ్‌ ప్రశంసించారు. చాలా కూల్‌ అని మెచ్చుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ అండర్‌టేకర్‌తో రానా ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ముచ్చటించారు. అండర్‌టేకర్‌తో జరిగిన సరదా సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా రానా షేర్‌ చేసిన ఫొటోపై మిహీకా స్పందించారు. ఆ ఫొటోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. ‘ది కూలెస్ట్‌ హస్బెండ్‌ ‌’ అని రిప్లై ఇచ్చారు. మిహీకా పెట్టిన పోస్ట్‌తో నెటిజన్లు.. ‘హో క్యూట్‌’ అంటున్నారు.

ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కొంతమంది నటీమణులతో మీకు ఆఫైర్స్‌ ఉన్నాయని చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వాటి గురించి మిహీకాకి తెలుసా’ అని రానాను ప్రశ్నించారు. ‘నా గురించి ఎన్నో రూమర్స్‌ వచ్చాయి అవన్నీ మిహీకాకి తెలుసు. అలాంటి వాటి గురించి  ఆమె ఎప్పుడు ఇబ్బందిపడలేదు’ అని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌, పెళ్లి కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న రానా తాజాగా ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆరణ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని