‘ఇప్పటికీ రానాను ప్రేమిస్తున్నా..!’

టాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటి పెళ్లితో ఎంతో మంది అమ్మాయిల హృదయాలు నొచ్చుకున్న సంగతి తెలిసిందే. రానా త్వరలో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. `సౌత్‌బే` పేరుతో ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ ఆరంభం కానుంది. ఇందులో వివిధ.....

Published : 12 Nov 2020 01:28 IST

అభిమాని పోస్ట్‌.. మిహీకా రిప్లై

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటి పెళ్లితో ఎంతో మంది అమ్మాయిల హృదయాలు నొచ్చుకున్న సంగతి తెలిసిందే. రానా త్వరలో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. `సౌత్‌బే` పేరుతో ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ ఆరంభం కానుంది. ఇందులో వివిధ రకాల కంటెంట్‌ని అందించబోతున్నారు. పది సెకన్ల నుంచి పది గంటల వరకు కథలను చెప్పబోతున్నామని రానా పేర్కొన్నారు. కేవలం కథలే కాకుండా సంగీతం, యానిమేషన్‌, ఫిక్షన్ అంశాలపై కూడా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తన ఛానెల్‌ ప్రచారంలో భాగంగా రానా సోషల్‌ మీడియాలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘రానా.. నీకు పెళ్లి అయినప్పటికీ నేను ప్రేమిస్తున్నా..’ అని పోస్ట్‌ చేశారు. దీనికి రానా స్పందిస్తూ.. ‘మిహీకాకు పిచ్చి ఎక్కుతుంది, బాధ పడుతుంది’ అనే అర్థంతో రిప్లై ఇచ్చారు. దీనికి మిహీకా ఫన్నీగా స్పందించారు. ‘నేను నీతో ఉన్న దానికంటే ఎక్కువ పిచ్చెక్కదు’ అని కామెంట్‌ చేయడం అందర్నీ నవ్విస్తోంది.

రానా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఆయన చేతిలో ‘హాథి మేరే సాథి’, ‘1945’, ‘హిరణ్య కశ్యప’, ‘విరాట పర్వం’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. రానా తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను ఆగస్టు 20న వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శుభకార్యాన్ని నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని