చిరు ‘లూసిఫర్’కు సారథి ఖరారు

మెగాస్టార్‌ చిరంజీవి 153వ చిత్రం ‘లూసీఫర్‌’కు ఎట్టకేలకు దర్శకుడిని ఖరారు చేసింది చిత్ర బృందం. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమా తమిళ మాతృక ‘తనిఒరువన్‌’కు దర్శకత్వం వహించిన మోహన్‌రాజ్‌.. మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు.

Updated : 16 Dec 2020 17:38 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్‌’కు ఎట్టకేలకు సారథిని ఖరారు చేసింది చిత్ర బృందం. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమా తమిళ మాతృక ‘తనిఒరువన్‌’కు దర్శకత్వం వహించిన మోహన్‌రాజ్‌.. మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ను తెలుగులో చిరు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిరు.. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగానే తన తర్వాతి సినిమానూ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

జనవరి చివరిలో ప్రారంభించి మూడునెలల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్రబృందం తెలిపింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారాయన. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘కు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశారు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి..

చిరు గొప్ప వ్యక్తి.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు: శివ

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని