ఎవరైనా సరే.. నేను వదలను: సునీల్‌

‘నా జోన్‌లో ఎవడైనా తప్పుచేస్తే వాడి లైఫ్‌ ఇంకా డేంజర్‌ జోనే. వాడు ఎంత తోపైనా నేను విడిచిపెట్టను’ అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి...

Updated : 29 Jun 2023 17:34 IST

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆగయా

హైదరాబాద్‌: ‘నా జోన్‌లో ఎవడైనా తప్పుచేస్తే వాడి లైఫ్‌కు డేంజర్‌ జోనే. వాడు ఎంత తోపైనా నేను విడిచిపెట్టను’ అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

కాగా, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ‘మోసగాళ్లు’ సినిమా నుంచి ఓ స్పెషల్‌ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. సునీల్‌ శెట్టి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ వీడియోని తీర్చిదిద్దారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవదీప్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని