కొణిదెల-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా..!

కొణిదెల ఇంటి వారసురాలు, నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేశారు. కొణిదెల-జొన్నలగడ్డ ....

Updated : 10 Dec 2020 13:36 IST

నెటిజన్ల మదిదోచిన అపురూప చిత్రాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొణిదెల ఇంటి వారసురాలు, నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ పరిణయ వేడుకకు ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ వేదికైంది. వేదమంత్రాలు, పెద్దల ఆశీర్వచనాలు, తోటివారి అభినందల నడుమ నిహారిక-చైతన్యల వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

శనివారం పెళ్లి కుమార్తెను చేయడంతో ప్రారంభమైన నిహారిక-చైతన్యల పరిణయ వేడుకలు ఐదురోజులపాటు కొణిదెల కుటుంబానికే కాకుండా అభిమానులకు ఎన్నో మధురమైన క్షణాలను అందించాయి. పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో చిరు-నిహారిక సెల్ఫీ.. సంగీత్‌లో అల్లుఅర్జున్‌-రామ్‌చరణ్‌ల సందడి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అందమైన ఫొటోలు ప్రతిఒక్కర్నీ ఆకర్షించారు. ముఖ్యంగా చెప్పాలంటే మెహందీ వేడుక.. పవన్‌ రాకతో పెళ్లికి మరింత కళ చేకూరినట్లు అయ్యింది. పవన్‌ తన ఇద్దరు పిల్లలతో వేడుకకు హాజరు కావడం ప్రతిఒక్కర్నీ ఎంతో ఆనందింప చేసింది. నిహారిక పెళ్లి వేడుకల్లో కొణిదెల-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా సాగిన ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలపై ఓ లుక్కేయండి..!

నిహారిక-చైతన్యలతో రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, శిరీష్‌, సాయిధరమ్‌ తేజ్‌


వధూవరులతో కలిసి సరదాగా నవ్వులు పూయిస్తున్న చెర్రీ-బన్నీ


బాబాయ్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చరణ్‌


సినిమాచూపిస్త బావ అంటోన్న వరుణ్‌తేజ్‌



సంగీత్‌ వేడుకల్లో చిరు-సురేఖ, చరణ్‌-ఉపాసన దంపతులు


సీటీమార్‌ అంటోన్న బన్నీ-చెర్రీ, నిహారిక-చై


మా వేడుకలకు నిండుదనం వచ్చింది


మెగా సారథితో కలిసి ఫొటోలకు పోజులిస్తున్న మెగా, అల్లు హీరోలు


పెదనాన్న కుటుంబాలతో అకీరా-ఆద్య


మెగాస్టార్‌తో స్టెప్పులేసిన బన్నీ.. చిత్రంలో చిరు పెద్ద కుమార్తె సుస్మితా దంపతులు


మామతో సాయిధరమ్‌ ఇలా..


హల్దీ వేడుకల్లో నిహారిక-చైతన్య


చెర్రీ-ఉపాసన


బన్నీ-స్నేహారెడ్డి


మెగా కజిన్స్‌


ఇవీ చదవండి
ఘనంగా నిహారిక-చైతన్య కల్యాణం

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని