బైకుల్లా జైలు నుంచి రియా చక్రవర్తి విడుదల

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజులపాటు బైకుల్లా జైలులో ఉన్న రియాను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఆమె కారులో ఇంటికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు మీడియాను

Published : 08 Oct 2020 01:58 IST

మీడియాకు ముంబయి పోలీసుల హెచ్చరిక

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  దీంతో దాదాపు నెలరోజుల పాటు బైకుల్లా జైలులో ఉన్న రియాను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. జైలు నుంచి ఆమె కారులో ఇంటికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు మీడియాను హెచ్చరించారు. ‘మీరు (మీడియా) ప్రముఖుల వాహనాల్ని ఛేజ్‌ చేయకూడదు. వారినే కాదు ఇంటర్వ్యూల కోసం న్యాయవాదుల్ని కూడా వెంటాడకూడదు. మీ జీవితాల్ని, సదరు సెలబ్రిటీ జీవితాన్ని. రోడ్డుపై ఉన్న వారి జీవితాల్ని అపాయంలోకి నెట్టకూడదు.. అది నేరం. ఇలా చేస్తే డ్రైవర్‌ పైనే కాకుండా అతడు అలా నడపడానికి కారణమైన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటాం’ అని ముంబయి డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సంగ్రామ్ సింగ్ నిశాందర్ పేర్కొన్నారు.

సుశాంత్‌ కేసుకు సంబంధించి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన రియా చుట్టూ గుమిగూడి అప్పట్లో మీడియా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి. మీడియా సిబ్బంది సామాజిక దూరం కూడా పాటించలేదు. భద్రత ఉన్నప్పటికీ మీడియాను దాటుకుని.. ముందుకు వెళ్లడానికి రియా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో మీడియాపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

సుశాంత్‌ మృతి కేసు విచారణలో రియా సెల్‌ఫోన్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన చాటింగ్‌ను సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి రియా విచారించి అరెస్టు చేసింది. ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా అధికారులు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌ను విచారించారు. ఈ క్రమంలో మీడియా వీరి వాహనాల్ని కూడా ఛేజ్‌ చేసింది. దీనిపై సంగ్రామ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘విచారణకు వస్తున్న ప్రతి సెలబ్రిటీ వాహనాన్ని మీడియా ఛేజ్‌ చేయడం మేం గమనించాం..’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి..

రియాకు బెయిల్‌.. 9 షరతులివే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని