DAY 1:నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?
తన కుమార్తె నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియో ప్రముఖ నటుడు నాగబాబు పంచుకున్నారు. తొలిరోజు వేడుకలంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేశారు. నిహారికకు మంగళ స్నానం చేయించడం, ముస్తాబు చేయడం...........
హైదరాబాద్: తన కుమార్తె నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియో ప్రముఖ నటుడు నాగబాబు పంచుకున్నారు. తొలిరోజు వేడుకలంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేశారు. నిహారికకు మంగళ స్నానం చేయించడం, ముస్తాబు చేయడం.. ఆమెను కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించడం తదితర ఘట్టాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఈ ఫంక్షన్ పూర్తయ్యాక వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడారు. రంగు రంగుల పువ్వులు.. తోరణాలు.. పిల్లల అల్లరి.. కుటుంబ సభ్యుల పెళ్లి సందడితో నిండిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ ఈ ‘మెగా’ శుభకార్యానికి వేదికైంది. కుటుంబ సభ్యులంతా సోమవారం ప్రైవేటు విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్, మంగళవారం సాయంత్రం మెహందీ వేడుక నిర్వహించారు.
ఇవీ చదవండి..
నిహారిక సంగీత్.. వైరల్ వీడియోలు
నిహారిక-చైతన్య వివాహం: చిరు అపురూప చిత్రం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ