
DAY 1:నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?
హైదరాబాద్: తన కుమార్తె నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియో ప్రముఖ నటుడు నాగబాబు పంచుకున్నారు. తొలిరోజు వేడుకలంటూ తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో అప్లోడ్ చేశారు. నిహారికకు మంగళ స్నానం చేయించడం, ముస్తాబు చేయడం.. ఆమెను కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించడం తదితర ఘట్టాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఈ ఫంక్షన్ పూర్తయ్యాక వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడారు. రంగు రంగుల పువ్వులు.. తోరణాలు.. పిల్లల అల్లరి.. కుటుంబ సభ్యుల పెళ్లి సందడితో నిండిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ ఈ ‘మెగా’ శుభకార్యానికి వేదికైంది. కుటుంబ సభ్యులంతా సోమవారం ప్రైవేటు విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్, మంగళవారం సాయంత్రం మెహందీ వేడుక నిర్వహించారు.
ఇవీ చదవండి..
నిహారిక సంగీత్.. వైరల్ వీడియోలు
నిహారిక-చైతన్య వివాహం: చిరు అపురూప చిత్రం