Published : 23 Nov 2020 19:46 IST

పక్కా మిడిల్‌క్లాస్‌ అబ్బాయిగా నాగచైతన్య

హైదరాబాద్‌: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ సినిమాకు ప్రేమకథల మాంత్రికుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇదిలా ఉండగా.. నేటితో 34వ వసంతంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్యకు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘లవ్‌స్టోరీ’ సినిమా పోస్టర్‌ను సమంత విడుదల చేసింది. ట్విటర్‌ వేదికగా తన భర్త నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. పోస్టర్‌ను పోస్టు చేసింది. అందులో నాగచైతన్య లుంగీ, బనియన్‌తో పక్కా మధ్యతరగతి యువకుడిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ సాయిపల్లవి కూడా పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంది. నటుడు సుశాంత్‌తో పాటు డైరెక్టర్‌ బాబీ ట్విటర్‌ వేదికగా చైతూకి శుభాకాంక్షలు చెప్పారు.





Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని