నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!

మరో రెండు రోజుల్లో నిహారిక కొణిదెల వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ఇప్పటికే మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. మంగళస్నానాలు, పెళ్లి కుమార్తెను చేయడంతో నాగబాబు నివాసంలో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి....

Updated : 08 Dec 2020 13:47 IST

స్పెషల్‌ పోస్ట్‌ పెట్టిన నటుడు

హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో నిహారిక కొణిదెల వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ఇప్పటికే మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. మరికొద్ది గంటల్లో తన కుమార్తె మరొక ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న తరుణంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.

నిహారికను పెళ్లికుమార్తెగా అలంకరించిన సమయంలో తన అన్నావదినలతో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘కుటుంబంగా నీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి కావాల్సిన రెక్కలు తండ్రిగా ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి. అలాగే ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్‌ యూ నిహారిక’ అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు.

గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది. డిసెంబర్‌ 9న జరగనున్న వీరి వివాహానికి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌ వేదిక కానుంది. దీంతో తాజాగా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు, తన తల్లి పద్మ నిశ్చితార్థ చీరలో నిహారిక పెళ్లి కుమార్తెగా మెరిసిపోయారు.

ఇవీ చదవండి

పెదనాన్న.. ముద్దుల కూతురు.. ఓ సెల్ఫీ

నిహారిక పెళ్లి కూతురాయనే...

పెళ్లికుమార్తెగా ముస్తాబైన నిహారిక(ఫొటోలు)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని