నిశ్చయ్‌.. డెస్టినేషన్‌ వెడ్డింగే ఎందుకంటే..?

నటుడు నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్యల వివాహం ఐదురోజులపాటు వేడుకగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిన వీరి వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలను గతకొన్నిరోజులుగా నాగబాబు సోషల్‌మీడియా...

Updated : 29 Jun 2023 17:45 IST

వీడియో షేర్‌ చేసిన నాగబాబు

హైదరాబాద్‌: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్యల వివాహం ఐదురోజులపాటు వేడుకగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిన వీరి వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలను గతకొన్నిరోజులుగా నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆయన ‘నిశ్చయ్‌’ సంగీత్‌ వీడియోను షేర్‌ చేశారు. సంగీత్‌లో నిహారిక-చైతన్య, నాగబాబు దంపతులు, రామ్‌చరణ్‌, బన్నీ వేసిన డ్యాన్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా నిహారికకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన ఈ వీడియోలో వెల్లడించారు.

‘నిహారికకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేయడానికి చాలా కారణాలున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు తక్కువమందితో మాత్రమే జరగాలనే నిబంధనలు ఉన్నాయి. అందుకే, కేవలం మా కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులతో ఈ విధంగా ప్లాన్‌ చేశాం. అదీకాక, మా కుటుంబంలో జరిగిన బన్నీ, చరణ్‌ వివాహాలను మేము పూర్తిగా ఎంజాయ్‌ చేయలేకపోయాం. ఎందుకంటే, వివాహానికి కొన్ని వేలమంది హాజరయ్యేవాళ్లు. దానివల్ల, ఏర్పాట్లు చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. కాబట్టి నిహారికకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అయితే బాగుంటుందని అనుకున్నాం. అలాగే, పెళ్లి తర్వాత ఎక్కువమందిని పిలిచి రిసెప్షన్‌ కూడా ఇస్తాం. చైతన్య-నిహారిక ఇష్ట ప్రకారమే ఈ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశాం. ఉయద్‌విలాస్‌కు సంబంధించిన పెళ్లి ఏర్పాట్లు అన్ని వరుణ్‌ చేశాడు.’ అని నాగబాబు వెల్లడించారు.

ఇవీ చదవండి

నిహారికను చూస్తే కన్నీళ్లు వచ్చేశాయ్‌..!

జాన్వికపూర్‌ని ఫాలో అయిన నిహారిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని