నాగబాబుకి కరోనా పాజిటివ్‌

నటుడు, నిర్మాత నాగబాబు కొవిడ్‌-19 బారినపడ్డారు. ఇటీవల ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఒక వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం కాదు..

Updated : 16 Sep 2020 11:27 IST

మామయ్య త్వరగా కోలుకోవాలి: కల్యాణ్‌ దేవ్‌

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత నాగబాబు కొవిడ్‌-19 బారినపడ్డారు. ఇటీవల ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఒక వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం కాదు. దాని నుంచి కోలుకుని వేరొకరి సాయం చేయాలి’ కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సరైన జాగ్రత్తలు పాటించి.. కరోనాని జయించి.. ప్లాస్మా దాతగా మారతాను’ అని నాగబాబు పేర్కొన్నారు.

కాగా, నాగబాబు పెట్టిన పోస్ట్‌ చూసిన అభిమానులు.. ఆయన వెంటనే కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నటుడు కల్యాణ్‌దేవ్‌ సైతం ‘నాగబాబు మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్‌ చేశారు. మరోవైపు కల్యాణ్‌దేవ్‌ పెట్టిన కామెంట్‌పై నాగబాబు స్పందించారు. ‘నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని