13వేల అడుగుల ఎత్తులో నాగార్జున

నాగార్జున కీలక పాత్రలో అహిషోర్‌ సోలమాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌డాగ్‌’. ఉత్కంఠభరిత కథా కథనాలతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హిమాలయాల్లోని రోహతంగ్‌లో....

Published : 23 Oct 2020 19:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున కీలక పాత్రలో అహిషోర్‌ సోలమాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌డాగ్‌’. ఉత్కంఠభరిత కథా కథనాలతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హిమాలయాల్లోని రోహతంగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను నాగార్జున పంచుకున్నారు.

‘‘రోహతంగ్‌ పాస్‌లో అందమైన ఉదయం. సముద్రానికి 3,980 మీటర్లు అంటే 13వేల అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబరు నుంచి డిసెంబరు మధ్య దీన్ని మూసేస్తారు. వైల్డ్‌డాగ్ షూటింగ్‌ కోసం ఇక్కడకు వచ్చాం. చిత్రీకరణ బాగా జరుగుతోంది. ఏడు నెలల తర్వాత ఇలాంటి ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్‌ 21 రోజుల్లో పూర్తయిపోతోంది. ఆ తర్వాత వచ్చేస్తాను. అప్పటివరకూ ప్రేమతో.. మీ నాగార్జున’’ అంటూ పేర్కొన్నారు.

ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టుపెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు