Nallamala: మంచి కథకు.. మంచి ఆదరణ

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో రవిచరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘నల్లమల’. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లో

Updated : 19 Mar 2022 09:01 IST

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో రవిచరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘నల్లమల’. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఆవు అమ్మ లాంటిది.. దాన్ని కాపాడుకోకపోతే  మనుగడ లేదు అనే కాన్సెప్ట్‌ తీసుకొని సినిమా తీశాం. మంచి కథకు.. మంచి ఆదరణ దక్కితే ఎలా ఉంటుందనేది ఈరోజు ప్రేక్షకులు చూపించార’’న్నారు. ‘‘సినిమా చాలా బాగుందని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ‘ఏమున్నావే పిల్లా..’ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అంది నాయిక భానుశ్రీ. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్‌, ఛాయాగ్రహణం: వేణు మురళి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని