Nallamala: ‘నల్లమల’లో.. కథే హీరో

అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా రవి చరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘నల్లమల’. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నిర్మాత దిల్‌రాజు చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated : 13 Feb 2022 11:37 IST

అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా రవి చరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘నల్లమల’. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నిర్మాత దిల్‌రాజు చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా గురించి చెప్పగానే ‘ఏమున్నవే పిల్లా’ పాట గుర్తొచ్చింది. పాటే అంత హిట్టయిందంటే.. సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. ఇంత మంచి కథ రాసి.. హీరోగా నాకు అవకాశమిచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్‌’’ అన్నారు హీరో అమిత్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నార’’న్నారు. ‘‘నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అంది నాయిక భానుశ్రీ. ఈ సినిమాకి సంగీతం: పి.ఆర్‌, కెమెరా: వేణు మురళి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని