మహేశ్‌-నమ్రత ఫొటో వైరల్‌!

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరకడంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు....

Published : 21 Sep 2020 12:34 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరకడంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్లు చేయడంతోపాటు తన పిల్లలతో కలిసి ఆటలు ఆడటం, ఈత కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను మహేశ్‌ సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఆమె మహేశ్‌తో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. 

‘‘మన ఉనికికి మూలకారణం ప్రేమే అని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రేమ మాత్రమే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ వల్ల వచ్చే భావోద్వేగం నుంచి ఉత్పన్నమవుతాయి. ఇది నా అవగాహన. అందరూ ప్రేమగా, ఒకరికొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఇవే నా నిజమైన సంతోషానికి కారణం’’ అని తెలిపారు. ఈ అపురూపమైన ఫొటోని సితార తీసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన సినిమా టైటిల్‌ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో మహేశ్‌ సరికొత్తగా కనిపించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts