Naresh: ‘నరేశ్‌ 59’కు క్లాప్‌ క్లాప్‌

‘నాంది’ సినిమాతో గతేడాది చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు అల్లరి నరేశ్‌. ఇప్పుడీ  జోష్‌లోనే ఓ కొత్త చిత్రం పట్టాలెక్కించారు. నరేశ్‌ నటిస్తున్న 59వ సినిమా ఇది. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకుడు.

Updated : 02 Feb 2022 07:04 IST

‘నాంది’ సినిమాతో గతేడాది చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు అల్లరి నరేశ్‌. ఇప్పుడీ  జోష్‌లోనే ఓ కొత్త చిత్రం పట్టాలెక్కించారు. నరేశ్‌ నటిస్తున్న 59వ సినిమా ఇది. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకుడు. రాజేష్‌ దండ నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్‌ కొట్టగా.. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అందరూ ఆదరించే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రూపొందుతోంది. నరేశ్‌ నుంచి ఆయన అభిమానులు కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి. వీలైనంత త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటర్‌గా, రామ్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని