Ante Sundaraniki: కలల సంద్రంలో లీలా

ఒక చేత్తో కెమెరా... మరోవైపు దీర్ఘాలోచనలు. కలల సంద్రంలో ప్రయాణిస్తున్న లీలా థామస్‌ కథేమిటో  తెలియాలంటే ‘అంటే... సుందరానికీ!’ చిత్రం చూడాల్సిందే. నాని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న

Updated : 18 Mar 2022 09:10 IST

ఒక చేత్తో కెమెరా... మరోవైపు దీర్ఘాలోచనలు. కలల సంద్రంలో ప్రయాణిస్తున్న లీలా థామస్‌ కథేమిటో  తెలియాలంటే ‘అంటే... సుందరానికీ!’ చిత్రం చూడాల్సిందే. నాని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో కథానాయికగా నజ్రియా ఫహాద్‌ నటిస్తోంది. ఆమె లీలా థామస్‌ అనే పాత్రలో సందడి చేయనుంది. లీలా థామస్‌ ప్రార్థన పేరుతో ఆమె లుక్‌కి సంబంధించిన వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ట్రెండీ లుక్‌తో దర్శనమిచ్చిన నజ్రియా పాత్ర సినిమాకి హృదయంలాంటిదని చిత్రబృందం చెబుతోంది. హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా నాయుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని