Hansika: రెప్పే వేసేలోగా..

హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’.  శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు.

Updated : 23 Mar 2022 13:55 IST

న్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ   సినిమాలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత, తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట...’ అంటూ సాగే పాటకి సంబంధించిన లిరికల్‌ వీడియోని విడుదల చేశారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ్‌ ఆలపించారు. మార్క్‌ రాబిన్‌ స్వరకర్త. ఈ  సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ‘‘ఇలాంటి కథని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలో ఉండే మలుపులు అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తాయ’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నార’’న్నారు. మలుపులు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తాయని దర్శకుడు చెప్పారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్‌, జయప్రకాష్‌, ప్రవీణ్‌, సీవీఎల్‌ నరసింహారావు, పూజా రామచంద్రన్‌, కేదార్‌శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని