బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ భామ..?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘మిస్టర్‌.మజ్ను’ చిత్రాలతో గతేడాది విజయాలు అందుకున్నారు నటి నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ చిన్నది బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న....

Updated : 22 Nov 2020 12:20 IST

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘మిస్టర్‌.మజ్ను’ చిత్రాలతో గతేడాది విజయాలు అందుకున్నారు నటి నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ చిన్నది బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలో కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే విషయంపై కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం నిధిని సంప్రదించగా.. పవన్‌ సరసన నటించేందుకు ఆమె కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15 రోజుల షెడ్యూల్‌ మాత్రమే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియన్‌ మూవీగా విడుదల కానున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని