తలంబ్రాల వేడుక.. నిశ్చయ్‌ ఇలా..!

వేదమంత్రాలు.. పెద్దల ఆశీర్వచనాల నడుమ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. పెద్దల నిశ్చయించిన సుమూహర్తానికి...

Updated : 08 Dec 2022 16:57 IST

 మురిసిపోయిన నిహారిక

ఇంటర్నెట్‌డెస్క్‌‌: వేదమంత్రాలు.. పెద్దల ఆశీర్వచనాల నడుమ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి జరిగిన వీరి వివాహానికి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌ వేదికైంది. ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు మెగా, అల్లు కుటుంబాలతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

కాగా, నిహారిక-చైతన్యల వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పెద్దల సమక్షంలో చైతన్యను మనువాడే వేళ నిహారిక ఉల్లాసంగా ఉన్నారు. కన్యాదానం, జీలకర్ర-బెల్లం, తాళికట్టు శుభవేళ.. ఇలా ప్రతి సందర్భంలోనూ నూతన జంట సంతోషాన్ని చూసి వేదికపై ఉన్నవారు ఆనందించారు. తలంబ్రాల వేడుకలో నిహారిక.. తన భర్త జుట్టును సరిచేస్తూ.. మురిసిపోయారు. అనంతరం మెగా, అల్లు కుటుంబసభ్యులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి.

వేడుకగా నిహారిక-చైతన్య వివాహం(ఫొటోలు)

ఇవీ చదవండి
ఘనంగా నిహారిక-చైతన్య కల్యాణం

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

NISChay: డ్యాన్స్‌ చేసిన చిరు,అరవింద్‌ దంపతులు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని