ఆ యువ దర్శకుడితో విజయ్‌ తదుపరి చిత్రం

ఎవరు.. ఎవరు.. ఆ దర్శకుడు.. అని ఎంతో ఆసక్తిని రేపింది కోలీవుడ్ సూపర్‌స్టార్‌ తలపతి విజయ్‌ నటించనున్న ‘తలపతి 65’ చిత్రం. ఈ ఉత్కంఠకు తెరపడుతూ ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర వర్గం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

Published : 10 Dec 2020 20:47 IST

చెన్నై: ఎవరు.. ఎవరు.. ఆ దర్శకుడు.. అని ఎంతో ఆసక్తిని రేపింది కోలీవుడ్ సూపర్‌స్టార్‌ తలపతి విజయ్‌ నటించనున్న ‘తలపతి 65’ చిత్రం. ఈ ఉత్కంఠకు తెరపడుతూ ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. తన మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’ అనే కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో అందాల నటి నయనతార కథానాయికగా నటించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

దర్శకుడు నెల్సన్‌ స్పందిస్తూ.. ఈ చిత్రానికి సంబంధించి తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘నా తదుపరి చిత్రం తలపతి విజయ్‌తో చేయబోతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది’ అని తెలిపారు.  ప్రస్తుతం విజయ్‌ నటించిన ‘మాస్టర్’ చిత్రం 2021 సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని