98 కేజీలు తగ్గిన కొరియోగ్రాఫర్‌‌..!

బాలీవుడ్‌లో సినిమా తారలంతా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో నటుడు ఫరీద్‌ ఖాన్ ఆరు నెలల్లో 18 కిలోలు తగ్గి ఆశ్చర్యానికి గురి చేశారు. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు.

Updated : 08 Dec 2022 13:08 IST

ముంబయి: బాలీవుడ్‌లో సినిమా తారలంతా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో నటుడు ఫరీద్‌ ఖాన్ ఆరు నెలల్లో 18 కిలోలు తగ్గి ఆశ్చర్యానికి గురి చేశారు. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘కపిల్‌ శర్మ షో’కు సంబంధించిన ప్రోమోలో బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 200 కిలోల బరువున్న తాను కొన్ని నెలల పాటు వర్కౌట్లు చేసినట్లు ఈ సందర్భంగా గణేశ్‌ ఆచార్య చెప్పారు. వ్యాయామం విషయంలో ఎంత కఠినంగా ఉండేవారనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్‌ చేసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. 

బరువు విషయంలో గణేశ్‌ ఆచార్య కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. ఇదే విషయమై 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా కఠినమైనది. ఏడాదిన్నర నుంచి నా బరువు తగ్గించుకోవటానికి కష్టపడుతున్నా. 2015లో నేను నటించిన ‘హే బ్రో’ చిత్రం కోసం 30-40 కిలోలు తగ్గాను’ అని తెలిపారు. రణ్‌వీర్‌ సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌, గోవింద, అజయ్‌ దేవగణ్‌ నటించిన పలు చిత్రాలకు గణేశ్‌ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా వ్యహరించారు. తాజాగా సింబా, పద్మావత్‌, జీరో చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. 2018లో ‘టాయ్‌లెట్‌’ చిత్రంలోని ‘గోరీ తూ లాత్‌ మార్‌’ పాటకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని