ప్రేమ, పరువు.. బంధాల్ని ఏం చేశాయి?

నలుగురు కోలీవుడ్‌ స్టార్స్ గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌.. నాలుగు కథలతో రూపొందించిన సినిమా ‘పావ కధైగల్’. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్‌, సిమ్రన్‌, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మానవ సంబంధాలపై ప్రేమ, పరువులాంటి అంశాలు ఎలాంటి......

Published : 27 Nov 2020 22:12 IST

చెన్నై: నలుగురు కోలీవుడ్‌ స్టార్స్ గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌.. నాలుగు కథలతో రూపొందించిన సినిమా ‘పావ కధైగల్’. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్‌, సిమ్రన్‌, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మానవ సంబంధాలపై ప్రేమ, పరువులాంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని నాలుగు అందమైన కథల నేపథ్యంలో ఆవిష్కరించారు. డిసెంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. భావోద్వేగంతో కూడిన కథాంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని