‘మహిళ ఆత్మగౌరవానికి ప్రతీకగా ‘పావకదైగళ్‌‌’..!

ఎనర్జెటిక్‌ దర్శకులు వెట్రి మారన్‌, గౌతమ్ మీనన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పావకాదైగల్‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలయింది. ఈ చిత్రం నాలుగు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

Published : 03 Dec 2020 23:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  ప్రముఖ దర్శకులు వెట్రి మారన్‌, గౌతమ్ మీనన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పావకదైగళ్‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలయింది. ఈ చిత్రం నాలుగు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. ప్రేమ, ఆత్మ సంతృప్తి, గౌరవం, సమానత్వం వంటివి అనుబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందో ఈ చిత్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా, జీవితంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లటం ఎంత ముఖ్యం అనేది ఈ చిత్రం ద్వారా దర్శకులు ప్రేక్షకులకు అందించారు.

‘తంగమ్‌’, ‘లవ్ పన్న ఉట్రనమ్’, ‘ఒరు ఇరవు’, ‘వాన్మగల్‌’ పేర్లతో పావకైదగల్‌ చిత్రాన్ని సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌, వెట్రి మారన్‌, గౌతమ్ మీనన్‌ నిర్మించనున్న విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలోని ‘తంగమ్’ ‘మానవ సంబంధాలను తెలియజేస్తుంది’ అని దర్శకురాలు సుధా కొంగర అన్నారు. ‘లవ్ పన్న ఉట్రనమ్’ చిత్రంలో ‘ఇద్దరు మహిళల మధ్య ఉన్న బంధాన్ని వెల్లడిస్తుంది’ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ చెప్పారు. ‘ఒరు
ఇరవు’ చిత్రంలో ‘తండ్రి, కుమార్తె మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది’ అని దర్శకుడు వెట్రి మారన్ అన్నారు. ‘వాన్మగల్‌’  చిత్రం నాకొక మంచి అనుభూతిని మిగల్చింది’ అని దర్శకుడు గౌతమ్ మీనన్‌ తెలిపారు. 

డిసెంబర్‌ 18న ఈ చిత్రం ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని వెల్లడించారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని