Updated : 06 Dec 2020 15:13 IST

ఆరు నెలల ముందు వరకు ఆమె అబ్బాయి..!

అదా సాహసం.. ట్రైలర్‌ చూడండి

ముంబయి: కథానాయిక అదా శర్మ అబ్బాయి పాత్ర పోషించారు. తన తర్వాతి చిత్రం ‘పతి పత్ని ఔర్‌ పంగా’ కోసం ఈ సాహసం చేశారు. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. నవీన్‌ కస్తూరియా, హిటెన్ తేజ్వానీ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 11న ఈ సినిమా ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో విడుదల కాబోతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో అదా.. ‘నేను ఆరు నెలల ముందు వరకు అబ్బాయిని, అమ్మాయిగా మారేందుకు శస్త్ర చికిత్స చేసుకున్నా..’ అని చెప్పడం కథపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రం గురించి అదా మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో పురుషుడి పాత్ర పోషిస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ‘ఇది ఓ రొమాంటిక్‌ కామెడీ. ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమలోపడతాడు, ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత తన భార్య అమ్మాయి కాదని తెలుస్తుంది. ఇందులో నేను పురుషుడి పాత్రలో నటించా. ఇది ఓ చక్కటి ప్రేమకథ.. ట్విస్ట్‌ బాగుంటుంది. ఈ సినిమా ద్వారా ట్రాన్స్‌జెండర్ల కష్టాల్ని తెలుపబోతున్నాం. ఇలాంటి ప్రయోగాత్మక, రిస్క్‌తో కూడిన పాత్రలతో సినిమాలు తీసే  దర్శకులకు నేను గుర్తు రావడం నా అదృష్టం. నా తొలి సినిమా ‘1920’ నుంచి నేను  ప్రత్యేకమైన పాత్రల్లోనే నటించేందుకే ప్రయత్నిస్తున్నా’ అని చెప్పారు.
అనంతరం కథానాయికగా గుర్తింపు పొందిన తను ఇలాంటి పాత్రలు చేయడంపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనన్న భయం లేదా? అని ప్రశ్నించగా.. ‘ప్రేక్షకులు ఏమనుకుంటారో అనే భయం నాకు లేదు. ఎందుకంటే నాకు అండగా ఉండేది వాళ్లే. ‘1920’లో నా పాత్ర భయంకరంగా ఉంటుంది. ‘కమాండో 2’లో విభిన్నంగా ఉన్న నా పాత్రను ఆదరించారు. కాబట్టి దీన్ని కూడా అలానే స్వీకరిస్తారనే నమ్మకం ఉంది’ అని అదా పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
రూ.10 భోజనంతో నెల రోజులు గడిపాం

జేమ్స్‌ బాండ్‌ను బీట్‌ చేసిన అల్లు అర్జున్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని