Updated : 17/12/2020 20:25 IST

ఆన్‌లైన్‌లో లీకైన ‘వకీల్‌సాబ్‌’ ఫొటోలు..!

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియోలు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ భాగ్యనగరంలో ప్రారంభమైంది. ఈ మేరకు తాజాగా ‘వకీల్‌సాబ్‌’కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను నగరంలోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగ్‌ సమాచారం తెలుసుకున్న ఎంతోమంది అభిమానులు పవన్‌ను కలుసుకునేందుకు సెట్‌ వద్దకు చేరుకున్నారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేయడంతోపాటు పలువురితో  ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’ సెట్‌ నుంచి పవన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌ దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ‘వకీల్‌సాబ్‌’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశారు‌ తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి

భాగ్యనగరంలో వకీల్‌సాబ్‌

అందుకే ఆ పాత్రలు చేయలేదు..


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని