Harihara Veeramallu: వీరమల్లు సన్నాహాలు

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. నిధి  అగర్వాల్‌ కథానాయిక. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్‌ నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుంది.

Updated : 15 Mar 2022 11:49 IST

వన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. నిధి  అగర్వాల్‌ కథానాయిక. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్‌ నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుంది. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులోనే పవన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సంగీతం: కీరవాణి, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని