చిరు-పవన్‌ చిత్రాల్లో ఆ కామన్‌ పాయింట్‌ ఉంటుందా?

ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ వరుస చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న

Updated : 15 Oct 2020 16:21 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ వరుస చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. మరోవైపు అన్నయ్య చిరంజీవి కూడా తమ్ముడి బాటలోనే ఒకదాని తర్వాత ఒక సినిమా చేస్తానంటూ దర్శకుల పేర్లను కూడా ప్రకటించారు. ‘ఆచార్య’ తర్వాత ఆయన ‘వేదాళం’ లేదా ‘లూసిఫర్‌’ రీమేక్‌ల్లో నటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల సినిమాల్లో ఒక కామన్‌ పాయింట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కమర్షియల్‌ హంగులు లేకుండా తెలుగు చిత్రాలు అరుదు. ప్రేక్షకులు కూడా హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లను చూడటానికి ఇష్టపడుతుంటారు. అయితే, పవన్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’(పింక్‌ రీమేక్‌), చిరు సందడి చేయనున్న ‘లూసిఫర్‌’ చిత్రాల మాతృక కథలో కథానాయికలకు చోటు లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో కథానాయికలు కనిపిస్తారని టాక్‌. ‘వకీల్‌ సాబ్‌’లో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తారని ఇప్పటికే టాక్‌ వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌ స్క్రిప్ట్‌ అంతా సిద్ధమైనట్లు సమాచారం. చిరు అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయట. తొలుత ఈ చిత్రానికి ‘సాహో’ సుజీత్‌ దర్శకుడిగా అనుకున్నా, ఇప్పుడు ఆ బాధ్యతలను వి.వి.వినాయక్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర విషయాలపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. మలయాళ ‘లూసిఫర్‌’ను యథాతథంగా తీస్తారా? లేక కథానాయిక పాత్ర జోడిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు