అలాంటి వారు తోడుండాలి

స్నేహమంటే... ధైర్యం ఇవ్వడం, దారి చూపడం’’ అంటోంది బుట్టబొమ్మ పూజాహెగ్డే. తన చిన్ననాటి స్నేహితురాళ్లు తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెంచారంది. వారిని గుర్తుచేసుకుంటే... ఎక్కడ లేని ధైర్యం తనలోకి వస్తుందని రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ..

Published : 16 Dec 2020 15:32 IST

‘‘స్నేహమంటే... ధైర్యం ఇవ్వడం, దారి చూపడం’’ అంటోంది బుట్టబొమ్మ పూజాహెగ్డే. తన చిన్ననాటి స్నేహితురాళ్లు తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెంచారంది. వారిని గుర్తుచేసుకుంటే... ఎక్కడ లేని ధైర్యం తనలోకి వస్తుందని రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించక... మనల్ని భయం వెంటాడుతుంటే... మన స్నేహితురాలు తోడుగా ఉండాలని చెప్పుకొచ్చింది. వారి స్నేహంతో ఎంతటి కష్టమైనా అధిగమిచ్చవచ్చని, తనకు అలాంటి ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. అలాగే తన చిన్ననాటి స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈమె అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్‌తో చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణకు త్వరలోనే హైదరాబాద్‌కు రానుంది పూజా హెగ్డే.

ఇవీ చదవండి

ఐ మిస్‌ యూ సుధీర్‌: రష్మి

త్వరలోనే సినిమాల్లో నటిస్తా: మేఘన రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు