నేను పెద్దయ్యాక హీరోయిన్‌ పూజానవుతా..!

నేను పెద్దయ్యాక హీరోయిన్‌ పూజా హెగ్డేనవుతా అంటూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. అది అటూఇటూ తిరిగి చివరకు హీరోయిన్‌ పూజా హెగ్డే వరకూ చేరింది. ఈ వీడియో చూసిన పూజా ఎంతో..

Published : 10 Nov 2020 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేను పెద్దయ్యాక హీరోయిన్‌ పూజా హెగ్డేనవుతా అంటూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. అది అటూఇటూ తిరిగి చివరకు హీరోయిన్‌ పూజా హెగ్డే వరకూ చేరింది. ఈ వీడియో చూసిన పూజా ఎంతో మురిసిపోయింది. ‘ఓ మైగాడ్‌.. ఈ చిన్నారి వీడియోతో నారోజు పరిపూర్ణం అయింది. ఆమె చెంపలు ఎంత ముద్దుగా ఉన్నాయో.. ఇంతవరకూ ఇలాంటి పాపను చూడలేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా నిన్ను కలుస్తాను. అప్పటివరకూ నా ప్రేమ, ముద్దులు ఈ ట్వీట్‌లో పంపిస్తున్నాను’ అని పేర్కొంటూ ఆమె చిన్నారి వీడియోను రీట్వీట్‌ చేసింది. ఆ వీడియోలో.. ‘నీ అభిమాన హీరోయిన్‌ ఎవరు.. పెద్దయ్యాక ఏమవుతావు అని చిన్నారి బాలికను ఒక వ్యక్తి ప్రశ్నించగా.. ‘నేను పెద్దయ్యాక హీరోయిన్‌ పూజా హెగ్డే అవుతా. ఎందుకంటే పూజా హెగ్డే చాలా అందంగా ఉంటుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ ముద్దుగా సమాధానం ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల పూజా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ‘దక్షిణాది ప్రజలకు నాభి, నడుము అంటే వ్యామోహం’ అని ఆమె అన్న మాటలకు అభిమానుల నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. అభిమానంతో ఆదరిస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్‌ కూడా చేశారు. ఆ తర్వాత స్పందించిన పూజా తన మాటల్ని చాలామంది అపార్థం చేసుకున్నారని, తాను తప్పుడు ఉద్దేశంతో ఆ మాటలు అనలేదని వివరణ ఇచ్చింది. తెలుగు సినీపరిశ్రమ తనకు ప్రాణంతో సమానమని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆమె కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని