టాలీవుడ్‌ నాకు ప్రాణ సమానం: పూజా హెగ్డే

తను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటల్ని నెటిజన్లు అపార్థం చేసుకున్నారని కథానాయిక పూజా హెగ్డే అన్నారు. ‘దక్షిణాది ప్రజలకు నాభి, నడుము అంటే వ్యామోహం’ అని ఇటీవల ఆమె అన్న సంగతి తెలిసిందే. దీంతో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కెరీర్‌ సక్సెస్‌కు కారణమైన.....

Published : 08 Nov 2020 21:40 IST

నాకెంతో ఇచ్చింది..

హైదరాబాద్‌: తను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటల్ని నెటిజన్లు అపార్థం చేసుకున్నారని కథానాయిక పూజా హెగ్డే అన్నారు. ‘దక్షిణాది ప్రజలకు నాభి, నడుము అంటే వ్యామోహం’ అని ఇటీవల ఆమె అన్న సంగతి తెలిసిందే. దీంతో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కెరీర్‌ సక్సెస్‌కు కారణమైన దక్షిణాది గురించి ఇలా మాట్లాడటం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి సన్నివేశాలు చేయడం ఇష్టంలేకపోతే, నటించకుండా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

దీనిపై పూజా హెగ్డే తాజాగా స్పందించినట్లు తెలిసింది. పూర్తి ఇంటర్వ్యూ చూడమని కోరుతూ.. ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. ‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో, అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించే వారికీ, నా అభిమానులకు తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావు ఇవ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా. నాకెంతో ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. పూర్తి ఇంటర్వ్యూ చూడండి.. ధన్యవాదాలు’ అని ఆమె ప్రకటనలో పేర్కొన్నట్లు ఓ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ పూజా హెగ్డే మాత్రం దీన్ని ఇంకా తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేయలేదు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని