జిమ్‌ ట్రైనర్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ రెడ్డిని సర్‌ప్రైజ్‌ చేశారు. అతడికి ఖరీదైన కారు బహుమానంగా ఇచ్చి.. నెట్టింట్లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లక్ష్మణ్‌ కుటుంబంతో కలిసి ప్రభాస్‌ ఫొటోకు పోజిచ్చారు.....

Updated : 06 Sep 2020 11:25 IST

ఖరీదైన కానుకతో..

హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ రెడ్డిని సర్‌ప్రైజ్‌ చేశారు. అతడికి ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారు బహుమానంగా ఇచ్చి.. నెట్టింట్లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లక్ష్మణ్‌ కుటుంబంతో కలిసి ప్రభాస్‌ ఫొటోకు పోజిచ్చారు. ప్రభాస్‌ గొప్ప నటుడే కాకుండా ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

లక్ష్మణ్‌ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభాస్‌కు జిమ్‌ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తున్నారు. ‘డార్లింగ్‌’ సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. ఇందులో ప్రభాస్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం వెనుక లక్ష్మణ్‌ శ్రమ ఉంది. ప్రభాస్‌ ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమౌతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1920 ప్యారిస్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది.  దీని తర్వాత ప్రభాస్‌-దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. అదేవిధంగా ప్రభాస్‌ హీరో ‘ఆదిపురుష్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని