ప్రభుదేవా ఆమెతో ప్రేమలో పడ్డారా?

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రభుదేవా, అతని భార్య రామలతల మధ్య పరస్పర మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఓ నటీమణిని ప్రేమ వివాహం...

Published : 13 Nov 2020 10:08 IST

పెళ్లి గురించి జోరుగా ప్రచారం

చెన్నై: ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోనున్నారా అంటే..? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రభుదేవా, అతని భార్య రామలతల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఓ నటీమణిని ప్రేమ వివాహం చేసుకోనున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. తాజాగా ప్రభుదేవా తన బంధువుతో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆమె కూడా ప్రభుదేవా ప్రేమను అర్థం చేసుకుందని.. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పెళ్లి వార్తలపై ప్రభుదేవా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గతేడాది విడుదలైన ‘దబాంగ్‌ 3’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని