మెగాస్టార్‌ ప్రశంస.. మర్చిపోను: ప్రదీప్‌

తనదైన కామెడీ టైమింగ్‌తో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలను హోస్ట్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రదీప్. తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో సందడి చేశారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటవారికి తెలియని ఎన్నో సరదా సంగతులను సుమతో ....

Published : 23 Nov 2020 11:50 IST

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌తో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలను హోస్ట్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రదీప్. తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో సందడి చేశారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటవారికి తెలియని ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు.

‘‘యాంకరింగ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైన సమయంలో మొదటిసారి మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు దూరం నుంచే ఆయన నన్ను చూసి.. దగ్గరకు రమ్మని పేరు పెట్టి పిలిచారు. ‘మీ వాయిస్‌ నాకు బాగా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది’ అని ఆయన ప్రశంసించారు. ఆయన మాటలతో అలాగే నిల్చుండిపోయాను. వెంటనే ఆయన కూర్చొండి అని చెప్పారు. ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని ప్రదీప్‌ వివరించారు. అంతేకాకుండా తాను కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ఊహించని రెస్పాన్స్‌ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని