Prakash Raj:‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ బృందం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీని ప్రకాశ్‌రాజ్‌ బృందం పరిశీలించింది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈనెల 10న జరిగిన ఎన్నికల ఫుటేజీ కావాలని పశ్చిమ మండల పోలీసులను ఆయన కోరిన విషయం తెలిసిందే.

Updated : 19 Oct 2021 06:56 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీని ప్రకాశ్‌రాజ్‌ బృందం పరిశీలించింది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈనెల 10న జరిగిన ఎన్నికల ఫుటేజీ కావాలని పశ్చిమ మండల పోలీసులను ఆయన కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి రెండు గంటల పాటు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.
అనంతరం ప్యానెల్‌ సభ్యులు బెనర్జీ, తనీశ్‌తో కలిసి మాట్లాడుతూ.. 
అనుమానాలు నివృత్తి చేసుకోవడానికే ఫుటేజీ పరిశీలించామని, ఎన్నికల అధికారి వద్ద ఉన్న ఏడు సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు చూడాల్సి ఉందని, వాటిని చూసిన తర్వాత మీడియా ముందుకు వస్తామని ప్రకటించారు. ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపిన మంచు విష్ణుకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయని, ఫుటేజీ ఇవ్వాలని కోరుతూ లేఖ రాస్తే తొలుత సరే అని, తర్వాత ఇవ్వడం కుదరదన్నారని, దీంతో తాము తదుపరి చర్యలు తీసుకున్నామని వివరించారు.

- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని