Bala krishna: వేట మొదలైంది

మరోసారి మాస్‌ లుక్‌లో సందడి చేస్తున్నారు బాలకృష్ణ. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఆయన అవతారం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతోంది. వేట మొదలైందంటూ చిత్రబృందం బాలకృష్ణ కొత్త సినిమా లుక్‌ని సోమవారం విడుదల చేసింది.

Updated : 22 Feb 2022 09:37 IST

రోసారి మాస్‌ లుక్‌లో సందడి చేస్తున్నారు బాలకృష్ణ. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఆయన అవతారం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతోంది. వేట మొదలైందంటూ చిత్రబృందం బాలకృష్ణ కొత్త సినిమా లుక్‌ని సోమవారం విడుదల చేసింది. ఆయన 107వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఇటీవలే సిరిసిల్లలో చిత్రీకరణ మొదలైంది. రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్‌ తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రమిది.

‘‘పక్కా మాస్‌ అంశాలున్న కథ. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. బాలకృష్ణని సరికొత్త రూపంలో చూపిస్తున్నారు గోపీచంద్‌ మలినేని. లుక్‌కి చక్కటి స్పందన లభిస్తోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: నవీన్‌ నూలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని