నెటిజన్లకు ప్రియా ప్రకాశ్‌ కౌంటర్‌..!

మలయాళీ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తాజాగా కొంతమంది నెటిజన్లకు కౌంటర్‌ ఇచ్చారు. కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టారైన ప్రియాకి ఇటీవల నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సోషల్‌మీడియాలో తన గురించి వస్తోన్న నెగెటివ్‌ కామెంట్లు తట్టుకోలేక ఆమె గతంలో కొంతకాలంపాటు...

Published : 18 Oct 2020 18:19 IST

ఫొటోషూట్‌పై విమర్శలు

తిరువనంతపురం: మలయాళీ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తాజాగా కొంతమంది నెటిజన్లకు కౌంటర్‌ ఇచ్చారు. కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టారైన ప్రియాకి ఇటీవల నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సోషల్‌మీడియాలో తన గురించి వస్తోన్న కామెంట్లు తట్టుకోలేక ఆమె గతంలో కొంతకాలంపాటు నెట్‌కు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి ఇన్‌స్టా వేదికగా అభిమానులకు చేరువైన ఆమె కొన్నిరోజుల క్రితం.. తన సరికొత్త ఫొటోషూట్ చిత్రాలను పోస్ట్‌ చేశారు.

కాగా, ప్రియా షేర్‌ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమె అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆమె తాజాగా తనపై వస్తోన్న నెగెటివ్‌ ట్రోల్స్‌పై స్పందించారు. ట్రోలింగ్స్‌ తనకి కొత్తకాదంటూ నెటిజన్లకు కౌంటర్‌ ఇచ్చారు. ‘తాజాగా షేర్‌ చేసిన ఫొటోలకు పలువుర్ని నుంచి నెగెటివ్‌ కామెంట్లు వచ్చాయి. కామెంట్లను నేను చదవలేకపోయాను. మొదటి నుంచి ఇలాంటి విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఈ స్థాయికి చేరుకున్నందుకు నేనెంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ప్రతి ఒక్కరిపట్ల దయాగుణంతో వ్యవహరించాలనే గొప్ప విషయాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాను. అందుకే కామెంట్లు చేసిన వారిని ఏమీ అనను. అంతేకాకుండా ట్రోలింగ్స్‌ నాకు కొత్త కాదు’ అని ప్రియా ప్రకాశ్‌ తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని