గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి

 ‘పెళ్లైయిన కొత్తలో’ ‘నవ వసంతం’ ‘గోలీమార్‌’ ‘హరేరామ్‌’ వంటి తెలుగు చిత్రాల్లో అలరించిన నటి ప్రియమణి. తమిళ, మలయాళ కన్నడ చిత్రాల్లోనూ నాయికగా నటించింది. ఇటీవల విడుదలైన ‘హిజ్‌ స్టోరీ’ అనే హిందీ వెబ్‌ సీరీస్ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె సాక్షి అనే చెఫ్‌ పాత్రలో నటించింది.

Updated : 29 Apr 2021 16:04 IST

ముంబయి: ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాల్లో కథానాయికగా అలరించారు నటి ప్రియమణి. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో పాటు, పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు, ‘హిజ్‌ స్టోరీ’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇందులో ఆమె సాక్షి అనే చెఫ్‌ పాత్రలో నటించింది.

తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి స్పందిస్తూ..‘‘ఈ చిత్రంలో నేను చెఫ్‌గా నటించాను. కానీ, నిజంగా నాకు కోడి గుడ్డు ఉడకబెట్టడం కూడా తెలియదు. సినిమా షూటింగ్‌ సెట్‌లో ఉన్న యువకులు నాకంటే బాగా వంటచేసేవారు. అలాంటిది నేను వంటగదిలో చేసే పోరాటాన్ని చూసి సెట్లో అందరూ నవ్వుకునేవారు. ఇక తోటి సహనటులైతే నాపై జోకులు వేసుకునేవారు. ఇందులో నా నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు’’అని తెలిపింది.

ప్రశాంత్‌ భాగియా దర్శకత్వంలో బాలాజీ టెలిఫిల్మ్స్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు కలిసి ఈ వెబ్‌సిరీస్‌ చిత్రాన్ని నిర్మించాయి. తన్వీర్‌ బుక్‌వాలా నిర్మాత. ఇందులో సత్యదీప్‌ మిశ్రా, మృణాల్‌దత్‌ కీలక పాత్రల్లో నటించగా నితిన్ భాటియా, పరిణిత సేథ్, రాజీవ్ కుమార్, చారు శంకర్, మిఖాయిల్ గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ALT బాలాజీ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 25న ఈ సిరీస్‌ విడుదలైంది. ప్రియమణి ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘నారప్ప’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌తో కలిసి ‘మైదాన్‌’ చిత్రంలో నటిస్తోంది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts