Priyanka Chopra: ప్రియాంకకు మరో క్రేజీ ఆఫర్‌

హాలీవుడ్‌లో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది నటి ప్రియాంక చోప్రా. ఇటీవలే ‘ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌’తో అలరించిన ఈ గ్లోబల్‌ నటి.ప్రస్తుతం ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇప్పుడీ భామ మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలిసింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆంథోని మాకీతో కలిసి ‘ఎండింగ్‌ థింగ్స్‌’లో నటించనుంది.

Updated : 04 Feb 2022 07:05 IST

హాలీవుడ్‌లో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది నటి ప్రియాంక చోప్రా. ఇటీవలే ‘ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌’తో అలరించిన ఈ గ్లోబల్‌ నటి.ప్రస్తుతం ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇప్పుడీ భామ మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలిసింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆంథోని మాకీతో కలిసి ‘ఎండింగ్‌ థింగ్స్‌’లో నటించనుంది. కెవిన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన యాక్షన్‌ కామెడీ సినిమా ‘ట్రూ లైస్‌’ తరహాలో ఉండనుందని సమాచారం. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళ కథలా ఉంటుందని తెలిసింది. దీన్ని డెవిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్‌స్పైర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌, మాకీస్‌ మేక్‌ ఇట్‌ విత్‌ గ్రేవీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఆంథోని మాకీ ‘యాంట్‌ మ్యాన్‌’, ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి సినీ ప్రియుల్ని మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని