AlluArjun: భన్సాలీతో సమావేశమై..

బాలీవుడ్‌కి చెందిన అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో ప్రముఖ కథా నాయకుడు అల్లు అర్జున్‌ సోమవారం ముంబయిలో సమావేశమయ్యారు. భన్సాలీ కార్యాలయంలోకి వెళుతున్న అల్లు అర్జున్‌ వీడియో

Updated : 15 Mar 2022 11:46 IST

బాలీవుడ్‌కి చెందిన అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో ప్రముఖ కథా నాయకుడు అల్లు అర్జున్‌ సోమవారం ముంబయిలో సమావేశమయ్యారు. భన్సాలీ కార్యాలయంలోకి వెళుతున్న అల్లు అర్జున్‌ వీడియో సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక సాధారణంగానే కలిశారా? అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రం దక్షిణాదితోపాటు, ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప2’ కోసం సన్నద్ధమవుతున్న అల్లు అర్జున్‌... తదుపరి చేయనున్న సినిమా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ దశలో ఆయన భన్సాలీతో సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని